విషాదం.. క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు వదిలిన బ్యాట్స్‌మెన్..!

Thursday, February 18th, 2021, 12:47:03 AM IST


క్రికెట్ ఆటలో ఆటగాళ్లకు గాయాలవ్వడం సర్వ సాధారణం. కానీ ఎలాంటి గాయం కాకుండా అప్పటి వరకు క్రికెట్ ఆడుతూ క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి మైదానంలోనే చనిపోవడం మాత్రం మునుపెన్నడూ జరిగిన సందర్భాలు లేవు. అయితే పుణేలోని జున్నార్ మండలంలో ఓ క్రికెట్ మ్యాచ్‌లో విషాదం చోటు చేసుకుంది.

అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్ మెన్ బౌలర్ బంతి వేయగానే పరుగు తీసేందుకు ప్రయత్నించి ముందుకు వెళ్ళాడు. అయితే బంతి కీపర్ చేతిలో పడటంతో వెనక్కి వచ్చాడు. అలా వెనక్కి వచ్చిన అతను కొద్దిసేపు అంపైర్‌తో కూడా మాట్లాడాడు. ఆ తరువాత ఉన్నట్టుండి బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చున్నాడు. అలా కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా క్రీజులో కుప్పకూలాడు. దీంతో ఏమైందో అర్థంకాక అక్కడున్న వారంతా షాక్‌కి గురయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.