కోహ్లీ సేనకు మూడో వన్డేలోనూ తప్పని ఓటమి!

Tuesday, February 11th, 2020, 03:49:54 PM IST


చాల ఏళ్ల తర్వాత భారత్ వన్డేల్లో కివీస్ గడ్డ ఫై వైట్ వాష్ కి గురైంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అయితే రాహుల్ సెంచరీ చేయడంతో భారత్ గట్టెక్కిందని అభిప్రాయం పడ్డారు. కానీ న్యూజిలాండ్ బ్యాట్సమెన్ ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఫై సునాయాసంగా గెలిచారు. అయితే టీ20 లో రాణించినంతగా టీం ఇండియా వన్డే సిరీస్ లో తన ప్రదర్శన ఆకట్టుకోలేకపోయింది. పేలవమైన బౌలింగ్ తో సిరీస్ ని న్యూజిలాండ్ కి సమర్పించేసింది. అయితే భారత్ చివరి సారిగా 1989 లో మూడు వన్డేల సిరీస్ లో వైట్ వాష్ కి గురైంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇలా వైట్ వాష్ కి గురైంది.