విరాట్ కోహ్లీ పై నెటిజన్ల ఆగ్రహం

Saturday, November 7th, 2020, 11:54:41 AM IST

టీమ్ ఇండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, ఐపియల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి కూడా సారధి గా వ్యవహరిస్తున్నారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓటమి చవి చూసింది. అయితే విరాట్ కోహ్లీ సారథ్యం వహించడం తో నెటిజన్లు స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా ఆర్సిబీ లీగ్ లో విజేతగా గెలవలేదు అని, టీమ్ ఇండియాకి కూడా కప్పులు తీసుకు రాలేడు అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.

అయితే విరాట్ కోహ్లీ సైతం మ్యాచ్ ఓటమి అనంతరం సోషల్ మీడియా వేది కగా స్పందించారు. ఒడిదుడుకల సమయం లో టీమ్ చాలా ఐకమత్యంగా ఉందని, ఒక జట్టుగా మ ప్రయాణం చాలా గొప్పగా ఉందని, పరిస్థితులు అనుకూలంగా మారలేదు అనేది నిజమే అయినా ఆటగాళ్ళ పట్ల గర్వంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చారు. త్వరలోనే మీ ముందుకు వస్తాం అని తెలిపారు. అయితే కీలక మ్యాచ్ లో ఓటమి అనంతరం కోహ్లీ పై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, వార్నర్ సేన మాత్రం క్వాలిఫైయర్ 2 కి అర్హత సాధించింది. ఢిల్లీ తో మరో మ్యాచ్ లో తలపడనుంది.