క్వాలిఫైర్1: ఢిల్లీపై ముంబై ఘన విజయం.. నేరుగా ఫైనల్‌కు..!

Thursday, November 5th, 2020, 11:30:49 PM IST

క్వాలిఫైర్ 1లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం నమోఅదు చేసుకుని నేరుగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అటు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన ఢిల్లీకి మరో అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 55 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు, క్వింటన్ డికాక్ 40 పరుగులు, హార్దిక్ పాండ్యా 37 పరుగులతో దాదాపు అందరూ రాణించారు.

అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్ దెబ్బకొట్టారు. ఒక్క పరుగు కూడా చేయకముందే ఢిల్లీ 3 వికెట్లు నష్టపోయింది. అయితే మార్కస్ స్టోయినిస్ 65 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.