ముంబై ఖాతాలో మరో ఘన విజయం.. చిత్తుగా ఓడిన చెన్నై..!

Friday, October 23rd, 2020, 11:55:22 PM IST


ఈ ఐపీఎల్‌లో వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏ దశలోనూ మెరుగుపడలేదు. నేడు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు భారీ మార్పులు చేసి కుర్రాళ్ళకు అవకాశం కల్పిస్తే వారు కూడా చెత్తగా ఫర్ఫాం చేసి చేతులెత్తేశారు. ముంబై బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యింది. సామ్‌ కరన్ ఒక్కడే 52 పరుగులతో చివరి వరకు పోరాడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి చెన్నై 114 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టును ఓపెనర్లే గెలిపించారు. స్వల్ఫ లక్ష్యం కావడంతో ఎలాంటి ప్రెజర్ లేకుండా బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు క్వింటన్ డికాక్ 46 పరుగులు, ఇషాన్ కిషన్ 68 పరుగులు చేయడంతో కేవలం 12.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ముంబై ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు టాప్ ప్లేస్‌కి చేరుకుంది.