ఐపియల్: 5 వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ

Thursday, October 1st, 2020, 11:33:48 PM IST


ఈ ఏడాది ఐపియల్ లేట్ గా ప్రారంభం అయినా, సరికొత్త ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుంది. అయితే ఈ ఐపియల్ 13 వ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు. ఐపియల్ లో 5 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా ముంబై టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచారు. ముంబై కి మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మద్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఈ ఫీట్ ను సాధించడం జరిగింది.

అయితే ఐపియల్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఈ ఫీట్ ను కేవలం ఇద్దరు మాత్రమే సాధించారు. ఇప్పటి వరకు ఐపియల్ లో అయిదు వేలకు పైగా చేసిన ఆటగాళ్ళు కోహ్లీ మరియు రైనా. తాజాగా వారి తర్వాత ప్లేస్ లో రోహిత్ శర్మ నిలిచారు. అయితే విరాట్ కోహ్లీ 180 మ్యాచ్ లలో 5,430 పరుగులు చేయగా, సురేష్ రైనా 193 మ్యాచ్ లలో 5,368 పరుగులు చేశాడు. అయిదు వేల పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ 173 ఇన్నింగ్స తీసుకోవడం జరిగింది.