ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా ధోనీ ఈ మైలురాయి చేరుకున్నాడు. 2008 ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
అయితే చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిధ్యం వహించిన ధోనీ, పుణె తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఆడి జట్టుకు ధోమ్నీ మూడు టైటిళ్లు సాధించిపెట్టాడు. అంతేకాదు ప్రతి సారి జట్టును ప్లేఆఫ్‌కి చేర్చాడు. ఇక ఐపీఎల్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 197 మ్యాచులు, సురేశ్ రైనా 193 మ్యాచులు, దినేశ్ కార్తీక్ 191 మ్యాచులు, విరాట్ కోహ్లీ 186 మ్యాచులతో వరుసగా ఉన్నారు.