ఇంట్లో కూర్చునే ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశానికి హీరోనే – మహ్మద్ షమీ

Friday, March 27th, 2020, 05:44:13 PM IST


ప్రస్తుతం కరోనా వైరస్ టైమ్ నడుస్తోంది. ప్రపంచ దేశాలు సైతం కరోనా వైరస్ బారిన పడి భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ నేపధ్యంలో భారత్ నీ సైతం ఈ వైరస్ పట్టి పీడిస్తుంది. అయితే ఈ వైరస్ నీ ఎదుర్కోవడానికి 21 రోజులు లాక్ డౌన్ లో ఉండాల్సిందే అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో పేసర్ మహ్మద్ షమీ ఈ విషయం పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 21 రోజుల పాటు ప్రజలంతా ఇళ్ళల్లో నే ఉండాలని తెలిపారు. దేశ ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండండి అని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం మనం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ సమయం మనకెంతో కీలకం అని వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చునే ప్రతి ఒక్క పౌరుడు హీరోనే అని వ్యాఖ్యానించారు. హీరోగా ఉండటం అంత తేలిక కాదని అన్నారు. అంతేకాకుండా వైద్యులు చెప్పిన విషయాలను పాటించాలని సూచించారు.