ఆ రాష్ట్రంలో ఐపీఎల్ టిక్కెట్లు బ్యాన్…ఎందుకో తెలుసా?

Wednesday, March 11th, 2020, 07:40:27 PM IST

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక చర్యలను తీసుకుంటున్నాయి. అయితే తాజగా మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ముఖ్య సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఈ సమావేశం లో ఐపీఎల్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ కి సంబంధించిన టిక్కెట్ల అమ్మకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే ఈ విషయం ఫై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ విషయం మాత్రం అభిమానులకు తెగ ఆందోళనని కలిగిస్తుంది. కరోనా వైరస్ ని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా తగ్గు ముఖం పట్టడం లేదు. అయితే అభిమానులు గుంపులు గుంపులు గా ఏర్పడకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.