టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐకి ఫిర్యాదు.. కారణం అదే..!

Monday, July 6th, 2020, 01:11:39 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐకి ఫిర్యాదు అందింది. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా ఈ ఫిర్యాదు అందించారు.

అయితే జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ 2 వ్యాపార సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నాడని, ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్ళు ఏ అధికారిక పదవులలో ఉండకూడదని, కోహ్లీపై వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.