ఐపియల్: 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన పంజాబ్!

Thursday, September 24th, 2020, 11:45:05 AM IST


ఈ ఏడాది ఐపియల్ లో తొలి శతకం బాది, తన టీమ్ ను ముందు ఉండి నడిపించారు కే ఎల్ రాహుల్. ఈ ఏడాది ఐపియల్ లో తొలి శతకం నమోదు చేయడం తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 206 భారీ పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆది నుండే కష్టాల పాలు అయింది.

భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు పరుగులకే వికెట్ ను కోల్పోయింది. అయితే అలా మూడు ఓవర్ లు కూడా ముగియకుండానే మూడు వికెట్ల ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ సైతం వెంటనే పెవిలియన్ కి చేరడం అభిమానులను సైతం ఆందోళన కి గురి చేసింది.కేవలం ఫించ్(20), డివిలియర్స్(28), వాషింగ్ టన్ సుందర్ (30) మరియు శివం దుబే(12) లు రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇంకా మూడు ఓవర్లు మిగిలి వుండగానే 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.