ఐపియల్: సెంచరీ తో కదం తొక్కిన కే ఎల్ రాహుల్

Thursday, September 24th, 2020, 09:53:19 PM IST

ఈ ఏడాది ఐపియల్ లేట్ గా మొదలైనా, ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఎక్కడా లోటు లేదని చెప్పాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై కే ఎల్ రాహుల్ సెంచరీ తో కదా తొక్కాడు. ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్ లో అంతగా రాణించని ఈ పంజాబ్ కెప్టెన్, ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 36 బంతులతో 7 ఫోర్లు, ఒక సిక్స్ తో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్, ఆ తర్వాత మాత్రం వచ్చిన ప్రతి బాల్ ను కూడా తనకు అణుగుణంగా మార్చుకొని సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు 7 సిక్స్ లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలవడం మాత్రమే కాకుండా, ఈ ఐపియల్ లో తొలి శతకం సాధించిన ఆటగాడికి నిలిచాడు.

అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై మూడు వికెట్ల నష్టానికి కింగ్స్ పంజాబ్ 206 పరుగులు చేయడం జరిగింది. అయితే ఈ భారీ స్కోరు వెనుక కే ఎల్ రాహుల్ ఉండటం గమనార్హం. కెప్టెన్ గా మాత్రమే కాకుండా, బ్యాట్స్ మన్ గా కూడా రాహుల్ ఫాం లోకి రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.