ఐ మిస్ యూ క్రికెట్…రాహుల్ భావోద్వేగ భరిత పోస్ట్!

Tuesday, July 14th, 2020, 01:03:38 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని పనులు వాయిదా పడ్డాయి. అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా క్రికెట్ ను ఆటగాళ్ళు సైతం చాలా మిస్ అవుతున్నారు. అయితే ఓపెనర కే ఎల్ రాహుల్ ఐ మిస్ యూ క్రికెట్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి పరిస్తితి ఇదే అంటూ చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశాడు. అయితే అందులో తన క్రికెట్ కిట్ ను సైతం కనబడేలా పోస్ట్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపియల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.