డివిలియర్స్ దూకుడు…కోల్ కతాకి 195 టార్గెట్ సెట్ చేసిన ఆర్సిబి

Monday, October 12th, 2020, 10:01:54 PM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి ఐపియల్ లో తన తడాఖా ను చూపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన కోహ్లీ సేన 20 ఓవర్ లలో 194 పరుగులు చేసి రెండు వికెట్ లను కోల్పోయింది. అయితే పడీక్కల్ 32 పరుగులు మరియు ఫించ్ 47 పరుగులతో తొలి వికెట్ కి 67 పరుగులు సాధించారు. అయితే వరుసగా రెండు వికెట్ లను కోల్పోయిన అనంతరం క్రేజు లోకి డివిలియర్స్ వచ్చాడు.

డివిలియర్స్ తన విద్వంస బ్యాటింగ్ తో కొల్ కతా బౌలర్ల కి చుక్కలు చూపించాడు. వరుస బౌండరీ ల తో మరోమారు డివిలియర్స్ దూకుడు ప్రదర్శించాడు. 23 బంతుల్లో అర్ద శతకం చేయగా, 33 బంతుల్లో 73 పరుగులు చేశాడు. కోహ్లీ 33 పరుగులు చేయడం తో బెంగళూర మరోమారు భారీ స్కోరు సాధించింది.