ఐపియల్: ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన పూరన్

Thursday, October 8th, 2020, 11:04:16 PM IST

సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య హోరాహోరీ పోరు నడుస్తున్న నేపద్యం లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హైదరాబాద్ ఇచ్చిన భారీ టార్గెట్ చేధన లో ప్రారంభం లో తడబడిన పంజాబ్ పూరన్ బ్యాటింగ్ తో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. 17 బంతుల్లో రెండు ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకు పడుతూ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. భారీ టార్గెట్ ను చెడిస్తు ప్రస్తుతం 77 పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నాడు.