రికవరీ అవుతున్నా.. భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ట్వీట్..!

Saturday, October 24th, 2020, 08:40:02 AM IST

భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌కు నిన్న గుండెపోటు అన్న వార్తలు వినగానే అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. కపిల్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు ఆయనకు గుండె ఆపరేషన్ చేశారు. అంతేకాదు ప్రమాదమేమి లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తాజాగా కపిల్‌దేవ్ తాను సేఫ్‌గా ఉన్నానని అభిమానులకు చెప్పేలా బెడ్‌పై నుంచే ఓ ఫోజ్ ఇచ్చాడు. పక్కనే కపిల్ కూతురు అమ్య కూడా కూర్చుని ఉంది. కపిల్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు చేసిన ప్రార్ధనలు ఫలించినట్టున్నాయి. అయితే తనపై అభిమానులకు ఉన్న ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ చెబుతూ ప్రస్తుతం బాగానే ఉన్నా రికవరీ అవుతున్నా అని కపిల్ ట్వీట్ చేశాడు.