ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కపిల్ దేవ్

Sunday, October 25th, 2020, 08:30:16 PM IST

ఇటీవల గుండెపోటు తో ఆసుపత్రి లో చేరిన 1983 వరల్డ్ కప్ హీరో, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. గుండెపోటు కారణంగా ఆసుపత్రి లో చేరిన కపిల్ దేవ్, శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే శస్త్ర చికిత్స విజయవంతం అవ్వడం తో తాజాగా కోలుకున్నారు. అయితే కపిల్ దేవ్ కోలుకొని డిశ్చార్జ్ అయిన విషయాన్ని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే కపిల్ దేవ్ కి యాంజియో ప్లాస్టి సర్జరీ చేసిన డాక్టర్ అతుల్ మధుర్ తో దిగిన ఫోటోను చేతన్ శర్మ పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు క్షేమం గానే ఉన్నారు అని, ఇంటికి కూడా వచ్చారు అని తెలిపారు. అయితే కపిల్ దేవ్ కోలుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.