సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఇంగ్లీష్ ఓపెనర్ జాసన్ రాయ్..!

Thursday, April 1st, 2021, 12:06:53 AM IST


ఐపీఎల్ ఈ ఏడాది సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకాబోతుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి స్థానంలో, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే మిచెల్ మార్ష్ దూరమయ్యాడనే బాధలో ఉన్న సన్‌రైజర్స్ అభిమానులకు గంటలో వ్యవధిలోనే గుడ్ న్యూస్ చెప్పింది. ట్విటర్ వేదికగా జాసన్ రాయ్‌కు కూడా స్వాగతం పలుకుతూ వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2021 సీజన్‌ నుంచి తప్పుకున్నాడని స్పష్టం చేసింది. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాలి. అయితే దీన్ని కష్టంగా భావించిన అతను లీగ్ నుంచి తప్పుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని బీసీసీఐతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడు. ఇదిలా ఉంటే 2017లో గుజరాత్ లయన్స్‌తో లీగ్‌లో ఆరంగేట్రం చేసిన జాసన్ రాయ్ తర్వాతి సీజన్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్య వహించాదు.