క్రీడల్లో కుంభకోణాలు సర్వ సాదారణం అయ్యాయి – మాల్యా

Wednesday, February 12th, 2014, 04:47:12 PM IST


ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం పై బుదవారం రోజు ఐపీల్ -7 టోర్ని కోసం జరుగుతున్న వేలంలో పాల్గొన్న రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ అధినేత విజయ్ మాల్యా స్పందించడం జరిగింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం పై ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడలో కుంభకోణాలు సర్వసాదారణం అయిపోయాయని అన్నారు. అలాగే కుంభకోణాలు క్రీడల్లో బాగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కుంభకోణాలు ప్రజాదరణ పొందిన ఐపీల్ బ్రాండ్ ఇమేజ్ ను ఏమి చేయలేవని, ఎంత మందిపై ఆరోపణలు వచ్చిన ఐపీల్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదని అన్నాడు. బ్రాండ్ ఇమేజ్ వున్న ఇలాంటి క్రీడలో కుంభకోణాలు జరగడం నిజంగా దురదృష్టకరం అని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ అల్లడు గురునాథ్ మెయప్పన్, ఆయనతో పాటు మరో ఆరుమంది భారత ఆటగాళ్ళు కూడా బెట్టింగ్ వ్యవహారంలో హస్తం వుందని జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.