యూఏఈ లో జరగనున్న ఐపియల్… మే 29 న అధికారిక ప్రకటన!?

Sunday, May 23rd, 2021, 10:55:19 AM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం కారణం చేత ఐపియల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆటగాళ్ళు సైతం కరోనా వైరస్ భారిన పడుతుండటం తో నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐపియల్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందా అని ఒక పక్క అభిమానులు సైతం ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఐపియల్ 2021 ను ఈ ఏడాది యూ ఏ ఈ లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపియల్ కూడా అక్కడే నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ ఐపియల్ మళ్ళీ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మే 29 న వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ మరియు SGM సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.