ఐపీఎల్ 2021: ముగిసిన వేలం.. ఏ జట్లు ఎవరెవరిని కొన్నాయంటే?

Friday, February 19th, 2021, 01:39:23 AM IST

ఐపీఎల్ 2021 వేలం ముగిసింది. హోరా హోరీగా తలపడిన ఫ్రాంచైజీలు ఎట్టకేలకు తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి. అయితే మొత్తం 292 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా 57 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అయితే ఈ సారి ఎక్కువగా ఆల్ రౌండర్లపై, ఫాస్ట్ బౌలర్ల వైపు ఫ్రాంచైజీలు మొగ్గుచూపాయి.

ఏఏ జట్లు ఎవరెవరిని కొనుగోలు చేసాయో చూద్దాం..

కోల్ కతా నైట్ రైడర్స్: షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, పవన్ నేగి, వెంకటేష్ అయ్యర్, షెల్డన్ జాక్సన్, వైభవ్ అరోరా

ముంబై ఇండియన్స్: నాథన్ కౌల్టర్-నైల్, ఆడమ్ మిల్నే, పియూష్ చావ్లా, జేమ్స్ నీషామ్, యుద్వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్కర్

చెన్నై సూపర్ కింగ్స్: కృష్ణప్ప గౌతమ్, మొయిన్ అలీ, చేతేశ్వర్ పుజారా, కె. భగత్ వర్మ, సి హరి నిశాంత్, ఎం హరిశంకర్ రెడ్డి

ఢిల్లీ క్యాపిటల్స్: టామ్ కుర్రాన్, స్టీవెన్ స్మిత్, సామ్ బిల్లింగ్స్, ఉమేష్ యాదవ్, రిపాల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ హుస్సేన్ మెరివాలా, ఎం సిద్ధార్థ్

పంజాబ్ కింగ్స్: జే రిచర్డ్సన్, రిలే మెరెడిత్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, డేవిడ్ మలన్, ఫాబియన్ అలెన్, జలాజ్ సక్సేనా, సౌరభ్ కుమార్, ఉత్కర్ష్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కైల్ జామిసన్, గ్లెన్ మాక్స్వెల్, డాన్ క్రిస్టియన్, సచిన్ బేబీ, రజత్ పాటిదార్, మహ్మద్ అజారుద్దీన్, సుయాష్ ప్రభుదేసాయ్, కె.ఎస్.భారత్

సన్ రైజర్స్ హైదరాబాద్: కేదార్ జాదవ్, ముజిబర్ రెహ్మాన్, జె సుచిత్

రాజస్థాన్ రాయల్స్: క్రిస్టోఫర్ మోరిస్, శివం దుబే, చేతన్ జకారియా, ముస్తఫిజుర్ రెహ్మాన్, లియామ్ లివింగ్స్టోన్, కెసి కరియప్ప, ఆకాష్ సింగ్, కుల్దీప్ యాదవ్