గబ్బా టెస్ట్: టీమిండియా గెలుపుకు ఇంకా 61 పరుగులు

Tuesday, January 19th, 2021, 12:43:16 PM IST

ఆస్ట్రేలియా తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది. బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టిన టీమ్ ఇండియా, బ్యాటింగ్ లో కూడా సత్తా చాటుతోంది. అయితే ప్రస్తుతం 265 పరుగుల వద్ద ఐదవ వికెట్ ను కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్ లో మాయాంక్ అగర్వాల్ 9 పరుగులకు ఔట్ అయ్యాడు. క్రీజులో ప్రస్తుతం రిషబ్ పంత్ మరియు సుందర్ ఉన్నారు. రిశబ్ అర్థ సెంచరీ తో అలరించగా ప్రస్తుతం 58 పరుగులతో ఉన్నాడు. సుందర్ ఒక పరుగు తో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకూ 88 ఓవర్ లకు గాను టీమ్ ఇండియా 267 పరుగులు చేసి ఐదు వికెట్ లను కోల్పోయింది. అయితే టీమ్ ఇండియా ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఇంకా 61 పరుగులు చేయాల్సి ఉంది.