ఈనెల 20వ నుంచి దక్షిణ కొరియాలో ఏషియా క్రీడలు ప్రారంభం కానున్నాయి..ఈ క్రీడలలో మనదేశం నుంచి వివధ కేటగిరీలలో అనేక మంది క్రీడాకారులు పాల్గొంటున్నా.. ముఖ్యంగా అందరి ఆశలు బాడ్మింటన్ పైనే. ఈ అంశంలో గత కొంత కాలంగా మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తున్నారు.. ముఖ్యంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మొన్న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో వీరిద్దరూ పతకాలు సాధించారు. అంతేకాకుండా.. చాలాకాలం తరువాత పారుపల్లి కాశ్యప్ బాడ్మింటన్ లో బంగారు పతకం సాధించారు. పతకాల వేటలో బాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తారని ఆశిద్దాం.
బాడ్మింటన్ పై భారీ ఆశలు
Thursday, September 18th, 2014, 09:51:25 AM IST