సరితాదేవికి ఏఐబిఏ షాక్

Wednesday, October 22nd, 2014, 02:14:09 PM IST


ఇండియన్ మహిళా బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడలలో సెమీఫైనల్ మ్యాచ్ లో జడ్జి తప్పుడు నిర్ణయం కారణంగా.. తాను ఓడిపోయానని విలపిస్తూ.. కాంస్య పతాకాన్ని తీసుకోకుండా వెళ్ళిన సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. అంతేకాకుండా.. ఇకపై ఆమె వివిధ రకాల పోటీలలో పాల్గొనకుండా ఏఐబిఐ నిషేధం విధించింది. దీంతో ఆమె బాక్సింగ్ కు సంబంధించిన సమావేశాలలో కూడా ఆమెకు ప్రవేశం లేదు. సరితాదేవిపైనే కాకుండా.. ఆమె కోచ్ లు గురుబక్షిత్ సింగ్ సాదు, ఫెర్నాండెజ్, సాగర్ దయాళ్ పై కూడా అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యనిషేధం విధించింది.