టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్…5 పరుగులకే వార్నర్ ఔట్..!

Thursday, January 7th, 2021, 08:30:15 AM IST

భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో నేడు మూడవ మ్యాచ్ జరుగుతుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ అయిదు పరుగులకు ఔట్ అయ్యాడు. మహ్మద్ సీరాజ్ వేసిన బంతిను షాట్ ఆడేందుకు ప్రయత్నించి పుజారా కి క్యాచ్ ఇచ్చాడు. అయితే జట్టు ఆరు పరుగుల వద్ద వార్నర్ ఔట్ గా వెను తిరగడం ఆసీస్ కి గట్టి దెబ్బ అని చెప్పాలి. ఇది ఇలా ఉండగా, టీమ్ ఇండియా లోకి నేడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేరాడు. మయంక్ అగర్వాల్ కి ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. అంతేకాక గాయపడిన ఉమేష యాదవ్ స్థానం లో నవదీప్ శైని ను తీసుకు వచ్చారు.