టెస్ట్ వార్ మొదలైంది

Tuesday, December 9th, 2014, 03:09:48 PM IST


ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు నుంచి ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆటను దీటుగానే ఆరంభించింది. ఫిల్ హ్యుస్ అకాల మరణం అనంతరం… జట్టు త్వరగానే కోలుకున్నది. ఇక, ఈ టెస్ట్ డేవిడ్ వార్నర్ సెంచెరీ సాధించారు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ 60 పరుగులతో రిటైర్ హార్ట్ అవ్వగా… స్మిత్ 72పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇక ఆస్ట్రేలియా జట్టు ఆట ముగిసే సమయానికి 354 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక భారత బౌలర్లలో మహమద్ షమీ, ఆరోన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా… ఇషాంత్ శర్మ, కె వి శర్మ లు చెరో వికెట్ ను పడగొట్టారు.

ఫిల్ హ్యుస్ అకాల మరణంతో మొదటి టెస్ట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందు… రెండు జట్లు ఫిల్ హ్యుస్ కు తమ సంతాపాన్ని ప్రకటించాయి. ఇప్పటికే షేన్ వాట్సన్… మ్యాచ్ గెలిచి భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని సంకేతాలు పంపారు.