ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ పై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ సీఈఓ మను సాహ్ని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ఉన్న సమయం లో టోర్నీ నీ నిర్వహించడం ప్రమాదకరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక వచ్చే ఏడాది, ఆ వచ్చే ఏడాది టోర్నీ లకు సంబంధించిన వివరాలను సైతం వెల్లడించింది.
అయితే ఐపియల్ నిర్వహణ పై ఇప్పటికే ఫ్రాంచైజ్ లు చాలా ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే ఐపియల్ నిర్వహణ కి ప్రయత్నిస్తాం అని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం తెలిపారు. కుదిరితే ముంబై లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. భారత్ లో కుదరని పక్షం లో దుబాయ్ లో ఈ ఏడాది ఐపియల్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే త్వరలో దీని పై ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కొందరు తమ అభప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.