నేను ఈ సంవత్సరం ఐపియల్ ఆడను – హర్భజన్ సింగ్

Saturday, September 5th, 2020, 12:21:24 AM IST

ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కి గట్టి దెబ్బే తగిలింది అని చెప్పాలి. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపియల్ లో అదేది లేదు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వలన ఈ సంవత్సరం ఐపియల్ ఆడటం లేదు అని, ఇవి కష్ట సమయాలు అని తెలిపారు.అంతేకాక కుటుంబంతో ఉన్నప్పుడు కొంత గోప్యత అశిస్తా అని తెలిపారు. అయితే ఈ విషయం లో సిఎస్కె తనకు చాలా సహాయ పడింది అంటూ తెలిపారు. ఈ ఏడాది ఐపియల్ బాగా జరగాలని, ప్రతి ఒక్కరూ కూడా సురక్షితం గా ఉండాలి అని జై హింద్ అంటూ వ్యాఖ్యానించారు.

సురేష్ రైనా అనంతరం హర్భజన్ సింగ్ సైతం అదే బాట పట్టడం తో జట్టు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వలన అందుబాటులో ఉండ డు అని తెలిపారు. అయితే మా జట్టు అతని నిర్ణయానికి మద్దతు ఇస్తుంది అని, ఈ కఠిన సమయం లో అండగా ఉంటుంది అని సీఈఓ కాశీ నాథన్ తెలిపారు.