ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం – ఐపీఎల్ తో సహా మిగతా ఆటలు నిషేధం…

Friday, March 13th, 2020, 01:11:40 PM IST

ప్రస్తుతానికి ప్రపంచాన్ని అంతటిని సైతం గజ గజ వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ వలన ఇప్పటికే చాలా మంది తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అంతేకాకుండా ఈ వైరస్ భయంకరంగా వ్యాపిస్తుండటం వలన ఇప్పటికే చాలా మంది మరణించారు. కాగా తాజాగా వైరస్ కారణంగా గురువారం నాడు భారత్ లో కర్ణాటకకు చెందిన కూడా మొదటి కరోనా వైరస్ బాధితుడు మృతి చెందాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ భయంకరమైన వైరస్ నుండి కాపాడుకోడానికి ముందు జాగ్రత్త చర్యగా దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

కాగా మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవనున్న ఐపీఎల్ ఆటలను జరగకుండా ఢిల్లీ ప్రభుత్వం అడ్డుకుంది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచులు చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. అందువలన ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ తో పాటే మిగిలిన ఆటలన్నింటిపై నిషేధాన్ని విధించింది. దానితో పాటే ఏప్రిల్ నెల వరకు కూడా అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు అన్ని కూడా మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.