బిగ్ న్యూస్: ఐపియల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Wednesday, July 22nd, 2020, 12:12:49 AM IST

ఈ ఏడాది జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ లు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఉదృతి పెరగడం తో ఈ ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను సైతం వచ్చే ఏడాది కి వాయిదా వేస్తూ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ తీసుకున్న నిర్ణయం తో ఐపియల్ కి మార్గం సుగమం అయింది అని చెప్పాలి.

ఇప్పటి వరకూ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపియల్ ను నిర్వహించడం జరుగలేదు. అయితే ఈ టోర్నీ ను యూ ఏ ఈ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు, అందుకు సంబంధించిన ఒక కీలక ప్రకటన చేశారు బ్రిజేష్ పటేల్. అయితే ఇప్పటి వరకూ ఐపియల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ విషయం గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ టోర్నీ ను నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. అయితే ఐసిసి తీసుకున్న ఒక్క రోజులోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.