బిగ్ అప్డేట్ : మొత్తానికి ఐపీఎల్ కు ఒక డేట్ వచ్చేసిందోచ్..!

Friday, July 24th, 2020, 01:33:48 PM IST

ఈసారి అనుకోకుండా వచ్చిన అతిధి కరోనా వైరస్ దెబ్బకు మనిషి తన జీవితంలో కోల్పోయాడు. వాటి అన్నిటిలో మన భారతీయులకు ఎంతో ఇష్టమైన “ఏపీఎల్” ఆగిపోయింది. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. కానీ ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ జరుగుతుంది అని ఎక్కడో చిన్న హోప్ అయితే అలా ఉంది. దానికి తగ్గట్టుగానే ఐసీసీ వారు కూడా ఊరిస్తూ వచ్చారు.

కానీ గత కొన్ని రోజుల కితం మాత్రం దాదాపు ఖరారే అన్న సంకేతాలు వచ్చాయి. దీనితో మళ్ళీ క్రికెట్ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి. దీనితో మన ఇండియన్ ఐపీఎల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ 19కి ముహూర్తం కుదుర్చుకుంది. ఈసారి మ్యాచులన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగడం కన్ఫర్మ్ అయ్యింది. సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యి ఫైనల్స్ నవంబర్ 8 తో ముగియనున్నాయి. దీనితో ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఈ కిక్ ఎంజాయ్ చేస్తున్నారు.