కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కోహ్లీ.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..!

Tuesday, March 16th, 2021, 09:16:04 PM IST


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా ఇంగ్లాండ్ పేస్ ధాటికి వెంట వెంటనే వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక రిషబ్ పంత్ 25 పరుగులు, చివర్లో హార్దిక్ పాండ్య 17 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో నిర్థీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ బౌలర్లలో మార్కు వుడ్ 3, జోర్దాన్ 2 వికెట్లు తీసుకున్నారు.