తొలి ఇన్నింగ్స్ 134 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లాండ్

Sunday, February 14th, 2021, 04:47:03 PM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో ఇండియా ప్రదర్శన పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయం లో మరొకసారి రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 134 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 59.5 ఓవర్ లకు 134 పరుగులు చేసి అలౌట్ అయింది.టీమిండియా బౌలర్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి మరొకసారి సత్తా చాటాడు.ఇషాంత్ శర్మ, అక్షర పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సీరాజ్ ఒక వికెట్ పడగొట్టి కీలక పాత్ర పోషించారు. టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన తో తోలి ఇన్నింగ్స్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.