సిక్సర్ల మోత మోగిస్తున్నఓపెనర్… ఈ ఐపీఎల్ లో అందరి చూపు అతనివైపే!

Monday, January 6th, 2020, 10:55:27 PM IST

ఈ ఏడాది ఐపీఎల్ లో సిక్సర్ల మోత ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ క్రేజ్ భారతదేశం లో విపరీతంగా పెరిగిపోయింది. సిక్సర్ల హవా ఐపీఎల్ లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేయనున్న టామ్ బాంటన్ కెఎఫ్సీ బిగ్ బాష్ లీగ్ లో వరుస సిక్సర్లతో ప్రత్యర్థుల ఫై విరుచుకు పడుతున్నాడు. కేవలం 16 బంతుల్లో 50 పరుగులు పూర్తీ చేసి మ్యాచ్ విన్నెర్ గా నిలిచాడు. అయితే ఇపుడు ఇతని పైనే కేకేఆర్ కూడా ఆశలు పెట్టుకుంది.

గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు కూడా కేకేఆర్ చేరుకోలేకపోయింది. అయితే డిసెంబర్ లో జరిగిన ఐపీఎల్ వేలం లో టామ్ బాంటన్ ని కేకేఆర్ కోటి రూపాయలకి దక్కించుకుంది. ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ వరుస సిక్సులు బాదిన వీడియో ఇపుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ సారి ఖచ్చితంగా ఐపీఎల్ లో సిక్సర్ల మోత ఖాయం అని నెటిజన్లు భావిస్తున్నారు.