అతడి కంటే అత్యుత్తమ బ్యాట్స్ మన్ ను నా జీవితం లో చూడలేదు – ఇంగ్లండ్ మాజీ స్పీన్నర్

Friday, April 17th, 2020, 10:37:09 PM IST

టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ది గ్రేట్ వాల్ గా ఖ్యాతి గాంచిన గొప్ప క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఎన్నోసార్లు టీం ఇండియా నీ ఒంటి చేత్తో ఆదుకున్నాడు. ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ లో ఆసీస్ బ్యాట్స్ మన్ ద్రవిడ్ స్టైల్ నీ ఫోలో అవుతుంటారు. అయితే రాహుల్ ద్రవిడ్ పై తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పి న్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ ద్రవిడ్ లాంటి అత్యుత్తమ క్రికెటర్ నీ నా జీవితం లో చూడలేదు అని వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాహుల్ ద్రవిడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా దృష్టిలో రాహుల్ ద్రవిడ్ అందరి కంటే గొప్ప క్రికెటర్ అని వ్యాఖ్యానించారు. కౌంటిల్లో ద్రవిడ్ కి నేను బౌలింగ్ చేసా అని చెప్పుకొచ్చారు. ఓ కౌంటీ గేమ్ లో ద్రవిడ్ అసలు ఔట్ కాలేదు అని అన్నారు. ఆ ఆట తీరు చూశాక ద్రవిడ్ అంటే ఇదే నేమో అని అనిపించింది అని అన్నారు. అతను బ్యాటింగ్ చేస్తుంటే నేను 11 ఏళ్ల స్పిన్నర్ లా ఫీల్ అయ్యా అని అన్నారు. అయితే గంభీర్ తో పాటు ద్రవిడ్ కి కూడా బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాక ద్రవిడ్ నీ ఔట్ చేసా అని చెప్పుకొచ్చారు. అయితే అది అద్భుత బంతే అని, ద్రావిడ్ నీ ఔట్ చేసే అంత బంతి కాదు అని ద్రవిడ్ పై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఇండియా ద్రవిడ్ ఎనలేని సేవ అందించారు.