మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల దెబ్బకు మరోసారి ఇంగ్లండ్ జట్టు కుప్పకూలిపోయింది. మరోసారి స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (4 వికెట్లు) స్పిన్ మాయాజాలాన్ని ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కేవలం 81 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌటయ్యింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు 33 పరుగుల అధిక్యం ఉండడంతో మరో 49 పరుగులు చేస్తే మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంటుంది. కాగా మొత్తం రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అక్షర్ పటేల్ 11 వికెట్లు తీయగా అశ్విన్ 7 వికెట్లు తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు తొలి రోజు 112 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఈ రోజు ఓవర్ నైట్ స్కోర్ 99/3 తో ఆట కొనసాగించిన భారత్ మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లు కోల్పోవడంతో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఇండియాకు తొలి ఇన్సింగ్స్ లో 33 పరుగుల స్వల్ఫ అధిక్యత లభించింది.