బ్రేకింగ్: డ్రీమ్ 11 ఐపియల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది..!

Sunday, September 6th, 2020, 05:31:38 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డ్రీమ్ 11 ఐపియల్ షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా బీసీసీఐ షెడ్యూల్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 19 న తొలి మ్యాచ్ ముంబై ఇండియ న్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి జరుగనుంది. అయితే తొలి మ్యాచ్ తోనే ఈ సీజన్ రసవత్తరం గా మారనుంది. అబుడాబి వేదిక గా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే అలానే ఆదివారం నాడు ఢిల్లీ క్యాపిటల్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మద్య లో జరగనుంది. ఇందుకు దుబాయ్ వేదిక కానుంది. అదే తరహా లో సోమవారం నాడు సన్ రైజర్స్ కి మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి మద్య మ్యాచ్ జరగనుంది.

ఇప్పటికే ఈ ఐపియల్ కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా పడటం ద్వారా, ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే మొదటి మ్యాచ్ ఇండియా టైమ్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా, మిగతా అన్ని మ్యాచ్ లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి. 24 మ్యాచ్ లు దుబాయ్ లో, 20 మ్యాచ్ లు అబుదబీ లో , 12 మ్యాచ్ లు షార్జా లో జరగనున్నాయి. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్ లకి సంబంధించిన షెడ్యూల్ మళ్లీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐపియల్ 2020 షెడ్యూల్