ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం.. ప్లేఆఫ్‌కు చేరిన ఇరు జట్లు..!

Monday, November 2nd, 2020, 10:01:04 PM IST


ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీనీ బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులను మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ దేవదూత్‌ పడిక్కల్‌ 50 పరుగులు, డివిలియర్స్‌ 35 పరుగులు, విరాట్‌ కోహ్లి 29 పరుగులతో రాణించారు.

అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ సులభంగా లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ 54 పరుగులు, రహానే 60 పరుగులు ధాటిగా ఆడడంతో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఢిల్లీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడమే కాకుండా ప్లేఆఫ్స్‌కి కూడా చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినప్పటికి కూడా ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది.