ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం.. రాజస్థాన్ రాయల్స్‌కు తప్పని పరాజయం..!

Thursday, October 15th, 2020, 01:05:00 AM IST


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం నమోదైంది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులకే ఓపెనర్‌ పృథ్వీషా, రహానెల వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్ లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ 161 పరగులు చేసింది.

అయితే 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. ఓపెనర్లు బెన్ స్టోక్స్ 41 పరుగులు, బట్లర్ 22 పరుగులు చేశారు. ఆ తర్వాత స్మిత్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్, ఊతప్ప ఇన్నింగ్స్ చక్కదిద్దినా వారు చివరి వరకు నిలబడలేకపోయారు. అయితే చివరలో రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చేస్తున్నప్పటికి ఢిల్లీ బౌలర్లు ఆ అతడికి చాన్స్ ఇవ్వలేదు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది.