ఐపీఎల్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ఢిల్లీ పేసర్ రబాడ..!

Sunday, October 18th, 2020, 10:51:18 AM IST

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ పేసర్ రబాడ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అతి తక్కువ మ్యాచుల్లో 50 వికెట్లను సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే రబాడ 27 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా, సునీల్ నరైన్ 32 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు. వీరి తర్వాత మలింగ, తాహిర్‌లు ఉన్నారు. ఇదిలా ఉంటే అతి తక్కువ బంతులలో 50 వికెట్లు తీసిన రికార్డ్ కూడా రబాడ పేరిటే నమోదయ్యింది. ఐపీఎల్‌లో 616 బంతుల్లో 50 వికెట్లు తీయగా, మలింగ 749 బంతుల్లో 50 వికెట్లు తీసుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే నిన్న ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నైపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మరోసారి పాయింట్ల పట్టికలో ఢిల్లీ నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్గ్ చేసిన ధోనీ సేన 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఫాప్ డుప్లెసిస్ 58 పరుగులు, రాయుడు 45 పరుగులు, షేన్ వాట్సన్ 36, రవీంద్ర జడేజా 33 పరుగులతో రాణించారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 58 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్టోయినిస్ 24 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు, చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 19.5 ఓవర్లలోనే విజయాన్ని దక్కించుకుంది.