వార్ వన్ సైడ్: రాజస్థాన్ ను చిత్తుగా ఓడించిన్ ఢిల్లీ!

Saturday, October 10th, 2020, 12:11:40 AM IST


ఈ ఏడాది ఐపియల్ సీజన్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ అని చెప్పాలి. ప్రత్యర్ధి తో సంబంధ లేకుండా ఢిల్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ లీగ్ లో ఢిల్లీ తన అయిదవ విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ 46 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓడి పోవడం తో ఢిల్లీ వార్ వన్ సైడ్ అయింది. 185 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, తన సత్తాను చాటలేక పోయింది. 138 పరుగులకు మొత్తం టీమ్ అలౌట్ అయింది. రాహుల్ తెవటియా (38), యశస్వి జైస్వాల్ (34) చెప్పుకోదగ్గ పరుగుల చేశారు.