నా చిట్టితల్లి మురిసిపోతుంది.. విరాట్‌కు థ్యాంక్స్ చెప్పిన డేవిడ్ వార్నర్..!

Saturday, January 30th, 2021, 09:30:39 PM IST

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ముద్దుల కూతురుకు ఇష్ట‌మైన క్రికెటర్ భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అని వార్నర్ స్వయంగా తెలిపాడు. మేం సిరీస్‌ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న నా చిట్టి తల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతామని, ఇండీ చాలా సంతోషంగా ఉందని వార్నర్ తెలిపాడు.

అయితే తనకు ఇష్టమైన విరాట్ కోహ్లీ జెర్సీ లభించడమే ఇందుకు కారణమని వార్నర్ చెప్పుకొచ్చాడు. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్‌, నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది. నేను, ఆరోన్ ఫించ్ పక్కనే ఉన్నా ఆమెకు విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టమని వార్నర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా ఇటీవల ఆసీస్‌ పర్యటనలో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుని అందరి మన్ననలు అందుకున్న సంగతి తెలిసిందే.