ఐపియల్: తప్పంతా నాదే…ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటా – డేవిడ్ వార్నర్

Sunday, September 27th, 2020, 01:01:11 PM IST

ఈ ఏడాది ఐపియల్ సీజన్ చాలా రసవత్తరంగా మారింది. చెన్నై బాట లో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రెండవ ఓటమి నమోదు చేసుకుంది. ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడం తో డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో కేన్ విలియం సన్ లేకపోవడం టీమ్ కి పెద్ద దెబ్బ ను చెప్పాలి. అంతేకాక కోలకతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క మనీష్ పాండే మినహా మిగతా అంతా కూడా విఫలం అయ్యారు. అయితే సన్ రైజర్స్ ఓటమి పై కెప్టెన్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తమ ప్రదర్శన బాగోలేదు అని అన్నారు. మొదట్లో రన్ రేట్ బాగున్నప్పటకీ చివరి వరకు కూడా దాన్ని కొనసాగించలేక పోయిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ మాచ్ లో ఎవరిని నిందించ దలచుకొలేదు అని, తప్పంతా నాదే కాబట్టి, ఓటమికి బాధ్యత కూడా నాదే అంటూ డేవిడ్ వార్నర్ అన్నారు. ఇన్నింగ్స్ మొత్తం ఆడినా కూడా నాలుగు వికెట్లు కోల్పోయాము అని, 20 ఓవర్లు ముగిసే సరికి ఇంకా ఇద్దరు బ్యాట్స్మెన్ బెంచ్ మీద ఉన్నారు అని తెలిపారు. అంతేకాక సరైన హిట్టర్స్ లేకపోవడం, ఎక్కువగా డాట్స్ బాల్స్ కూడా ఈ మ్యాచ్ లో ఉండటం తమ ఓటమికి కారణం గా భావించారు. తర్వాత అడబోయే మాచు లో తమ మైండ్ సెట్ మార్చుకొని ఆడతాం అని తెలిపారు.