సన్ రైజర్స్ కి కెప్టెన్ గా ఉండటం గౌరవం గా భావిస్తున్నా – డేవిడ్ వార్నర్!

Tuesday, July 28th, 2020, 10:10:45 PM IST


సన్ రైజర్స్ కి కెప్టెన్ గా వ్యవహరించడం గౌరవం గా భావిస్తున్నా అని ఆస్ట్రేలియా ఓపెనర డేవిడ్ వార్నర్ అన్నారు. 2018 లో బాల్ టాంపరింగ్ కారణంగా ఒక ఏడాది పాటు క్రికెట్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. 2016 లో సన్ రైజర్స్ కి నాయకత్వం వహించి కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే 2018 లో క్రికెట్ కి దూరం అయ్యాక, మళ్లీ 2019 లో విలియం సన్ నేతృత్వం లో ఆడారు డేవిడ్. అయితే ఈ ఏడాది ఐపియల్ కోసం సన్ రైజర్స్ మళ్లీ డేవిడ్ ను కెప్టెన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయం పై నేడు నిర్వహించిన ఇంటర్వ్యూ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ కి కెప్టెన్ గా చేయడం గౌరవం అని, జట్టులోని ప్రతి ఒక్కరూ కూడా నాయకుడే అని, గత ఏడాది కూడా పేరు కి ముందు సి ఉందా లేదా అని చూడలేదు అని తెలిపారు. అయితే విలియం సన్, తాను ఇద్దరు ఆలోచనలు పంచుకుంటారు అని అన్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపియల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. యూ ఏ ఈ లో నిర్వహించేందుకు ఐపియల్ సిద్దం అయింది.