చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్…ఆ జట్టులోని ఒకరికి కరోనా పాజిటివ్.

Friday, August 28th, 2020, 07:06:05 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. ఈ ఏడాది జరగాల్సిన ఐపియల్ ఇప్పటికే వాయిదా పడింది. అయితే ఐపియల్ నిర్వహణ కోసం సర్వం సిద్దం చేస్తోంది బీసీసీఐ. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఒక ఆటగాడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అంతేకాక టీమ్ సహాయ సిబ్బంది 12 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయం నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బీసీసీఐ నిబంధన ల ప్రకారం ఆర్ టీ పి సి ఆర్ పరీక్షల్లో వీరికి కరోనా సోకినట్లు తేలింది. అయితే ఈ విషయం పట్ల జట్టు కాస్త ఆందోళన కి గురి అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై జట్టు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఏడాది యూ ఏ ఈ లో ఐపియల్ జరగనున్న సంగతి తెలిసిందే.