ఐపియల్: అదరగొట్టిన పృథ్వీ షా…సీఎస్కే టార్గెట్ 176

Friday, September 25th, 2020, 09:53:47 PM IST


ఐపియల్ ఈ ఏడాది నువ్వా నేనా అన్నట్లు ఒక్కొక్క మ్యాచ్ జరుగుతోంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ భారీ పరుగులు చేసింది. పృథ్వీ షా 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ తో 64 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 35,శ్రేయాస్ అయ్యర్ 26, రిషబ్ పంత్ 37 పరుగులు చేయడం తో ఢిల్లీ మంచి స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఢిల్లీ గట్టి టార్గెట్ సెట్ చేసింది అని చెప్పాలి.

ఢిల్లీ మరొకసారి తన సత్తా చూపేందుకు సిద్దం కాగా, చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే తరహాలో విజయం సాధించేందుకు ఉవ్విలురుతుంది. 175 పరుగులు చేసిన ఢిల్లీ, నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్లను కోల్పోగా, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు పీయూష్ చావ్లా రెండు వికెట్లు, సామ్ కరణ్ ఒక వికెట్ పడగొట్టారు.