చెన్నై మరొక ఓటమి…ఢిల్లీ ఘన విజయం!

Saturday, September 26th, 2020, 12:20:01 AM IST


ఈ ఏడాది ఐపియల్ సీజన్ లో రెండో ఓటమిని నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటికే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై పలు విమర్శలు వస్తుండగా, ఈ ఓటమి తో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. 176 పరుగుల భారీ లక్ష్యం చేదన లో చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి131 పరుగులు చేసింది. అయితే 44 పరుగుల తేడాతో ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ విజయం ను నమోదు చేసింది.

మొదటి నుండి స్లో అండ్ స్టడీ గా ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ దుప్లిసేస్ 43 పరుగులు, కేదార్ జాదవ్ 26 పరుగులు చేయగా, మురళి విజయ్, షేన్ వాట్సన్, ధోనీ మరియు జడేజా లు 20 కి పైగా కూడా స్కోర్ చేయలేకపోయారు. మరొకసారి చెన్నై ఓటమి తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.