కరోనా ఎఫెక్ట్ : ఆసీస్ ఎలా సంబరాలు చేసుకుంటున్నారో చూడండి.!

Friday, March 13th, 2020, 05:56:52 PM IST


ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో మనం చూస్తున్నాము.గత కొన్ని రోజుల నుంచి ఈ వైరస్ దెబ్బకు సినిమాల నుంచి క్రీడలు వరకు పలు పెద్ద పెద్ద వ్యాపారాలు వరకు భారీ ఎత్తున నష్టాలు చూడక తప్పడం లేదు.అయితే ఈ కరోనా దెబ్బకు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రపంచ దేశాల్లో ఇప్పటికే సూచనలు వెళ్లిపోయాయి.నేరుగా కరచాలనం చేసుకోడం గాని అలాగే ఊరికినే ఒత్తి చేతులతో కళ్ళు నోర్లు లాంటి ప్రదేశాల్లో తాకడం కానీ వంటివి అనేక దేశాల్లో ఇప్పటికే తగ్గించేశారు.

అయితే ఈ సలహాలు సూచనలు క్రికెట్ ఆటగాళ్లు కూడా తూచా తప్పకుండ చాలా శ్రద్దగా వహించడం ఇప్పుడు కెమెరా కంటికి చిక్కింది.తాజాగా ఆసీస్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఒన్డే సిరీస్ మ్యాచులలో ఓ దృశ్యం ఇప్పుడు బయటకు వచ్చింది.ఓ ఓవర్ లో న్యూజిలాండ్ ఆటగాడి వికెట్ ను ఆసీస్ జట్టు బౌలర్ పడగొట్టగా ఆ సంబరాలను ఎవ్వరూ ఏమాత్రం అదుపు తప్పకుండా ఒక్కరు కూడా చేత్తో చేయిని కొట్టుకోకుండా మోచేతులతో కొట్టుకొని సంబరాలు చేసుకున్నారు.ఇప్పుడు దీనికి సంబందించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.