ఆఖర్లో రెచ్చిపోయిన జడేజా.. కోల్‌కత్తాపై 6 వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై..!

Thursday, October 29th, 2020, 11:55:03 PM IST

ఐపీఎల్‌లో నేడు కోల్‌కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరిలో జడేజా మెరుపులు మెరిపించడంతో కోల్‌కత్తా ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ నితీష్‌ రాణా 87 పరుగులు, శుభమన్ గిల్‌ 26 పరుగులు, దినేష్ కార్తిక్ 21 పరుగులతో రాణించారు.

అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. వాట్సన్‌ 14 పరుగులకే ఔట్ అయినా గైక్వాడ్‌ 72 పరుగులు, రాయుడు 38 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే కెప్టెన్ ధోనీ కూడా తొందరగా ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా కోల్‌కత్తా వైపు మారిపోయింది. అయితే చివరి రెండు ఓవర్లో జడేజా మెరుపు షాట్లు ఆడి కేవలం 11 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.