టీం ఇండియా ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్రియాన్ లారా

Thursday, March 12th, 2020, 11:02:22 PM IST

ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లకు ఈ ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రియాన్ లారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే టీంఇండియా టీ20 ప్రపంచ కప్ ని ఘనంగానే ప్రారంభిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు. టీం ఇండియా కు కప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అయితే ఆస్ట్రేలియా కి సొంత గడ్డ కావడం తో ఆ జట్టుకు ఈ విషయం బలమిచ్చే అంశమని అభిప్రాయం వ్యక్తం చేసారు. అంతేకాకుండా సొంతగడ్డపై ప్రదర్శన బావుంటేనే కప్ సొంతమవుతుందని వ్యాఖ్యానించారు. భారత్ 2007 లో టీప్రపంచ కప్ ని గెలవగా, ఆసీస్ ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవకపోవడం గమనార్హం. అయితే అక్టోబర్ 18 నుండి ఈ ప్రపంచ కప్ మొదలుకానుంది.